Nara Lokesh Prajadarbar : కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నారా లోకేశ్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో రూ. 4 కోట్ల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఐ బి. శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని అక్రమించారని యువనేత ఎదుట చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల నుంచి గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నానని, 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ పైనే ఆధారపడి బతుకుతున్నానని చూచుకొండ శ్రీనివాసరావు యువనేత ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ షాక్ తో రెండు చేతులు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాటిబోయిన రవీంద్ర నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ రాష్ట్రం నీ తాత జాగీరా జగన్- ధనదాహానికి అంతు లేదా?: లోకేశ్ - Nara Lokesh on YSRCP Offices