Rahul Gandhi Release Congress Manifesto in Tukkuguda :తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే, జాతీయ స్థాయిలోనూ కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ, నేరుగా తుక్కుగూడ సభకు వచ్చారు. జనజాతర సభ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం 'న్యాయ పత్రం' పేరిట కాంగ్రెస్ జాతీయస్థాయి మేనిఫెస్టోను(Congress National Manifesto) విడుదల చేశారు. గ్యారంటీ కార్డులను ఆవిష్కరించారు.
తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే యువతకు 25 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని, తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా ఆ హామీని నిలబెట్టుకుంటామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తామని తెలిపారు. ‘మహిళ న్యాయం’ ద్వారా పేద మహిళలకు ఏటా రూ.లక్ష మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమచేస్తామని తెలిపారు. ఇది ఓ విప్లవాత్మక పథకమని వివరించారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case
"మేం రూ.500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహలక్ష్మి, ఉచిత బస్సు హామీలను ఇచ్చాం. మీ అందరి మాటలను విని మేం ఈ హామీలు ఇచ్చి అమలు చేశాం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే వాటిని కచ్చితంగా అమలు చేస్తుందని ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణలో ఇచ్చిన హామీలను ఎలా అయితే నిలబెట్టుకున్నామో అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. దేశంలోని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఈ మేనిఫెస్టో."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత