ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి షాక్​ - రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా - ఆమోదం - Krishnaiah resigned to Rajya Sabha

R Krishnaiah resigned to Rajya Sabha Membership: రాజ్యసభ సభ్యత్వానికి ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపించారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదించారు. వైఎస్సార్​సీపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరి కొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

krishnaiah_resigned_to_rajya_sabha
krishnaiah_resigned_to_rajya_sabha (ETV Bharat)

R Krishnaiah Resigned to Rajya Sabha Membership:వైఎస్సార్​సీపీకి, జగన్​కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు.

తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

పతనం దిశగా వైఎస్సార్​సీపీ: ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను వైఎస్సార్​సీపీ సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. రాజ్యసభలో వందశాతం గెలిచాం. లోక్‌సభ, అసెంబ్లీలోనూ తెలుగుదేశం పార్టీని జీరో చేస్తామంటూ అప్పటీ సీఎం జగన్ అతని అనుచరులు ప్రగల్భాలు పలికేవారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం తరువాత వైఎస్సార్​సీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. అవమానాలు, ఇబ్బందులు ఉన్నా ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆ పార్టీని వీడుతున్నారు. ఇటీవల బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ తమ సభ్యత్వానికి రాజీనామా చేయగా తాజాగా ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరి రాజీనామాలతో రాజ్యసభలో వైఎస్సార్​సీపీ బలం 8కి పడిపోయింది.

కార్పొరేషన్​ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యం - పూర్తి లిస్ట్​ ఇదే - CORPORATION POSTS FILLED

తిరుమల లడ్డూ వ్యవహారం - సిట్​ చీఫ్​గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి - Sarva Sreshta Tripathi as SIT Chief

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details