Purandeswari Fires on CM Jagan :రాష్ట్రం నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీని నిర్మూలించేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. నెల్లూరు జీజీహెచ్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) సహా బీజేపీ కీలక నాయకులు కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
BJP Booth Level Workers Meeting in Nellore :బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పురందేశ్వరి వైఎసార్సీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జగన్, ఆయన అస్మదీయులు జేబులు నింపుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికి పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు దోపిడి చేస్తున్నారని నాయకులు విమర్శించారు.
టీడీపీ,జనసేన, బీజేపీల మద్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ
జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ, మహాకవి తిక్కన నడియాడిన నేలలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అయిన వైఎస్సార్సీపీని కూలదోయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తొలగించాల్సి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, కబ్జాలు, ఇసుక దోపిడీలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాఫియాలాగా భూములను దోచుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లిక్కర్ మాఫియాతో కల్తీ మద్యం ప్రజల చేత బాగా తాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు - ఈ నెల 17 లేదా 18న ఉండొచ్చని చంద్రబాబు సంకేతాలు
ఎన్టీఏ కూటమి 400 స్థానాలను గెలవబోతోంది :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న చక్కటి పాలన చూసి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వదిలి బీజేపీలోకి వస్తున్నారని చెప్పారు. దేశంలోనే కాదు విదేశాలకు వెళ్లినా ప్రజలంతా మోదీ మోదీ అని స్మరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, అదే విధంగా చత్తీస్ఘడ్, రాజస్థాన్‌లలో కూడా బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. 'ఇండియా కూటమి (India Alliance)' గురించి ప్రజలు పట్టించుకోవడం లేదని, మేమంతా మోదీ కుటుంబం అని అంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 'ఎన్టీఏ కూటమి (NDA Alliance)' 400 స్థానాలను గెలవబోతోందని తెలిపారు.
బాబు, మోదీ మధ్యలో పవన్!- ఆ విషయంలో జనసేనాని వ్యూహాత్మక అడుగులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీని నిర్మూలించేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలి : పురందేశ్వరి