Police Obstacles to Ra Kadali Ra : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Eluri Sambasivarao) ప్రారంభించారు. రాత్రి సమయంలో పోలీసులు సభాస్థలికి వచ్చి దేవాదాయశాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున పనులు నిలిపేయాలని ఆదేశించారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా అధికారులు స్పందించలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములే- వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు
Ra Kadali Ra Meeting at Parchur :ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, ఇంకొల్లు-పావులూరు రహదారి పక్కన 30 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని నిర్ణయించారమని తెలిపారు. ఇందులో 19 ఎకరాలు దేవాదాయశాఖ భూమి ఉందని, మిగిలిన భూమి ప్రైవేటుదని, వారంతా అంగీకారం తెలిపారని గుర్తు చేశారు. దేవాదాయశాఖ భూమి 13 ఎకరాలను కౌలుకు సాగు చేసుకుంటున్న రైతు సభ నిర్వహణకు అంగీకారం తెలపడంతో ఆ స్థలంలో పనులు ప్రారంభించామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు రా కదలిరాసభ నిర్వహణకు అన్ని అనుమతులు కోరుతూ దరఖాస్తులు సైతం చేశామని తెలిపారు. చంద్రబాబు రాక కోసం హెలిప్యాడ్ అనుమతికి సైతం ఆర్ అండ్ బీ అధికారులకు దరఖాస్తు చేశామని అన్నారు. రాత్రి పోలీసులు పనులు నిలిపివేయాలంటూ హుకుం జారీ చేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.