attack on NTR Bhavan : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశాయి. ఆ పార్టీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. పోలీసులు రెండున్నరేళ్ల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ప్రత్యేక అధికారుల బృందం పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ ముమ్మరం చేసింది. పోలీసులు దాడికి పాల్పడిన వారి దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాల్లో చూసి నిందితుల్ని గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారి పైనా పోలీసులు దృష్టి పెట్టారు.
YCP ATTACK: తెదేపా కార్యాలయాలపై కర్రలు, రాళ్లతో దాడులు.. అట్టుడికిన రాష్ట్రం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం(ఎన్టీఆర్ భవన్) పై 2021 అక్టోబరు 19న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విజయవాడ తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దాడి జరిగి రెండున్నరేళ్లయినా ఈ కేసులో పోలీసులు ఒక్కరినీ అరెస్టు చేయలేదు. సీసీటీవీ ఫుటేజీలున్నా నిందితుల్ని ఇప్పటివరకు గుర్తించలేకపోయారు.
State bandh: రాష్ట్ర బంద్‌పై పోలీసుల ఉక్కుపాదం.. పలుచోట్ల ఉద్రిక్తత
టీడీపీ ఆఫీస్‌తో పాటు ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపైనా అల్లరిమూకలు దాడి చేశాయి. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు, ఆ పార్టీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలతో రాష్ట్రం అట్టుడికింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులు తీవ్ర విస్మయానికి గురిచేశాయి. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఈ అరాచకానికి తెగబడ్డారని టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. దాడులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ దాడులు తగవని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ దుష్ట సంప్రదాయానికి తెర తీసిందని వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. కాగా, టీడీపీ ఆరోపణల్ని ఖండించిన వైఎస్సార్సీపీ నేతలు... కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని, ఎవరితోనో రాళ్లు వేయించడం, భౌతికంగా ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని పేర్కొన్నారు.
డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న కార్యాలయంపై యథేచ్ఛగా దాడికి పాల్పడిన దుండగులు.. పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. వాస్తవానికి దాడిని పసిగట్టిన టీడీపీ కార్యాలయ వర్గాలు ముందే ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక తీరిగ్గా వచ్చారు.
NOTICE: తెదేపా కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందికి నోటీసులు