Peethala Murthy Yadav on Visakha Dairy Chairman:విశాఖ డైయిరి ఛైర్మెన్ ఆడారి ఆనంద్ రాజీనామా చెయాల్సింది వైఎస్ఆర్సీపీకి కాదని విశాఖ డైయిరీ ఛైర్మెన్ పదవికని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. కేవలం 2 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి ఇప్పుడు రూ.2 వేల కోట్లుకు అధిపతి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. విశాఖ డైరీని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. 11 మండలాల్లో, 3,80,000 మంది పాడి రైతులు కష్టం విశాఖ డైయిరి అని అన్నారు. ఒక్క రైతు కుటుంబం కూడా అభివృద్ధి కాలేదు కానీ ఆడారి కుటుంబం అంతకంతకు పెరిగిందని అన్నారు. అందుకే సోసైటీ ప్రెసిడెంట్లకు ఆనంద్ బంగారు బిస్కెట్లు గిఫ్ట్‌గా ఇచ్చారని మూర్తి యాదవ్ అన్నారు.
ఒక హర్షత్ మెహతాలా డైయిరీ సొమ్ములతో స్థలాలు కొనడం, కబ్జా చెయ్యడం లాంటివి చేశారని ఆరోపించారు. దేశ సైనికుడు దేశ ద్రోహం చెయ్యడం ఎంత నేరమో పాల రైతులను ఒక రాజకీయ నాయకుడు మోసం చేయడం కూడా అంతే నేరమని అన్నారు. ఆడారి ఆనంద్ ఒక రాజకీయ ఊసరవెల్లి లాంటి వారని అన్నారు. అన్నారు. రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని ఈలాంటి వ్యక్తులు రాజకీయాలను కూడా మలినం చేస్తారని పీతల మూర్తి యాదవ్ అన్నారు.