Parties Speed Up Election Campaign In Medak :మెదక్ పార్లమెంట్ పరిధిలో మెుత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న10 నియోజకవర్గాల్లో 7 శాసనసభ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని కంచుకోటగా మార్చుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ ఇక్కడ విజయ కేతనం ఎగరవేయగా ఈ సారీ ఇక్కడి స్థానాన్ని చేజార్చుకోకూడదని బీఆర్ఎస్ యోచిస్తుంది.
అందులో భాగంగానే మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డికి అధిష్ఠానం సీటు ఖరారు చేసింది. అధికారిగా తనకున్న అనుభవంతో ప్రజా సమస్యలను తీరుస్తానంటూ హామీలిస్తూ వెంకటరామిరెడ్డి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన 9 నెలల లోపు రూ.100 కోట్లలతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని పేదవిద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గ(parliament constituency) అభివృద్ధికి నిత్యం పాటుపడతానని హామిలిస్తున్నారు.
BJP Strategies To Win Medak MP Seat : మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ్నుంచి రఘునందన్‌రావు రెండోసారి బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినా తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ(BJP) తరఫున పోటీ చేసిన విజయం సాధించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంపై పట్టు, గత పాలనా అనుభవం రఘునందన్‌కు కలిసి వస్తుందనే పార్టీ యోచించి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో తనదైన వాక్చాతుర్యంతో దూసుకుపోతున్న రఘునందన్ రామమందిరం, ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకెళ్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.