NSUI Calls For Bharat Bandh On July 4th :నీట్ పేపర్ లీకేజీకి నిరసనగాఈ నెల 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీపైన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పైన బాధ్యత ఉందని తెలిపారు.
ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాం అన్న ఆయన వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మిగతా పరీక్షలపై కూడా అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
"నీట్ పరీక్ష పేపర్ లీకేజితో కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్షపైన అనుమానం కలుగుతోంది. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. చలో రాజ్‌భవన్ వంటి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఈ నెల 4న విద్యా సంస్థల భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పైన బాధ్యత ఉంది. నరేంద్ర మోదీ మీద ఒత్తిడి తీసుకువచ్చి నీట్ పరీక్షను రద్దు చేయించి కొత్తగా నిర్వహించాలి. చట్టాలను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం. చట్టాలను కూడా అమలు చేసేలా కేంద్రంపైన బాధ్యత ఉంది." - బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ