Nara Lokesh Fire on CM Jagan in Shankaravam:ప్రజా ధనాన్ని సీఎం జగన్ లూటీ చేస్తున్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని బాడంగిలో నిర్వహించిన శంఖారావం సభలో పాల్గొన్న ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టారు. ఈ నియోజవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయన్న లోకేశ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శంబంగి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో మాట్లాడిన ఆయన టీడీపీ హయాంలో బొబ్బిలిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బొబ్బిలిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపై పడి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం కియా తరహాలో విశాఖకూ పెద్ద పరిశ్రమ తెస్తామని హామీ ఇచ్చారు.
రాజ్యసభ ఎన్నికలపై చంద్రబాబు క్లారిటీ
Nara Lokesh Shankaravam at Salur Constituency: సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్రను బొత్స, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వస్తున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ఉత్తరాంధ్రలో సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తామని హామీ ఇచ్చారు.
ఉపముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలన్న లోకేశ్ రాజన్నదొర 4 సార్లు ఎమ్మెల్యే అయినా సాలూరు పరిస్తితి మారలేదని మండిపడ్డారు. రాజన్నదొర పెన్నులోని ఇంకు చిన్న శ్రీను దగ్గర ఉంటుందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాలూరులో వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సాలూరు తండాల్లోని గిరిజనులకు పక్కా ఇళ్లు కట్టించి, లారీలకు పన్ను తగ్గిస్తామన్నారు.
ఏటా డీఎస్సీ: నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఆలస్యమైతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దీంతోపాటు ఏటా డీఎస్సీ నిర్వహించే బాధ్యత తనదన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, సూపర్ సిక్స్ ద్వారా మహిళలకు ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తామన్నారు.
వైఎస్సార్సీపీలో సామాజిక అన్యాయం వైఎస్సార్సీపీ 'పెద్ద'లకు మరో షాక్? - రాజ్యసభ బరిలో టీడీపీ!
Nara Lokesh Fire on CM Jagan in Shankaravam Meeting: వైఎస్సార్సీపీలో సామాజిక సాధికారత లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పార్వతీపురం మన్యం జిల్లా చినబొండపల్లిసే నిర్వహించిన శంఖారావం సభలో వైఎస్సార్సీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వైఎస్సార్సీపీ, 22 మంది లోక్‌సభ, 9 మంది రాజ్యసభ సభ్యులుంటే కేంద్రాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కాదు కదా కేంద్రంలో మన రాష్ట్రం పరువు తీసేశారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీలో సామాజిక అన్యాయం జరుగుతోందన్న ఆయన పైగా ఆ పార్టీ నేతలు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇప్పటికే 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను బదిలీ చేసిందన్నారు. బదిలీ చేసిన వారిలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ వాళ్లే ఉన్నారని తెలిపారు. బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్న లోకేశ్, 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన జగన్ భవిష్యత్తులో గాలికి కూడా పన్ను వేసి వసూలు చేసేలా ఉన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆత్మీయ సమావేశం- వారి సహకారం కోరిన యువనేత
"ఎన్నికలకు ముందు 25 ఎంపీలు గెలిస్తే దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ ఆ దిశగా కృషి చేసిందా ? ప్రత్యేక హోదా కాదు కదా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంలో మన పరువు తీశారు. వైఎస్సార్సీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతోంది. జగన్ పెద్ద కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేసిన ఏకైక సీఎం జగనే. జగన్‌కు 2 బటన్లు ఉంటాయి.. బల్లపై బ్లూ బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బ్లూ బటన్ నొక్కితే రూ.10 పడతాయి, ఎర్ర బటన్ నొక్కితే రూ.100 పోతాయి. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు. భవిష్యత్తులో గాలికి కూడా జగన్ పన్ను వేసి వసూలు చేస్తారు." - నారా లోకేశ్
అరాచకాల్లో ఆరితేరిన తండ్రీ కొడుకులు - తిరుపతిలో అంతా ఆ నాయకుడి 'కరుణ'