ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

శైవక్షేత్రాల నేల - దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించిన నంద్యాల - Nandyal LOK SABHA ELECTIONS - NANDYAL LOK SABHA ELECTIONS

Nandyal constituency : జ్యోతిర్లింగం శ్రీశైల మహా క్షేత్రం, మహానంది, యాగంటి. ఇలా శైవ క్షేత్రాలకు పెరెన్నికగన్న లోక్​సభ నియోజకవర్గం నంద్యాల. రాజకీయాల పరంగా భారత రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన నీలం సంజీవరెడ్డి, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇక్కడి నుంచి ఎన్నికైన వారే కావడం విశేషం.

శైవక్షేత్రాల నేల- దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించిన నంద్యాల
శైవక్షేత్రాల నేల- దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని అందించిన నంద్యాల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:22 AM IST

Nandyal constituency : కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం (Nandyal Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌కు రిజర్వ్‌ చేయబడి ఉంది. నియోజకవర్గాల పునర్వవ్యవస్థీకరణకు ముందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ శాసనసభా స్థానం ఈ నియోజకవర్గం పరిధిలో ఉండేది. అనంతరం దాన్ని ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో కలిపారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

  1. ఆళ్లగడ్డ
  2. శ్రీశైలం
  3. నందికొట్కూరు (ఎస్సీ)
  4. పాణ్యం
  5. నంద్యాల
  6. బనగానపల్లె
  7. డోన్‌

ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16,97,696
  • పురుషులు 8,33,589
  • మహిళలు 8,63,770
  • ట్రాన్స్‌ జెండర్లు 337
nandyala_loksabha

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 9సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, మూడుసార్లు తెదేపా, రెండుసార్లు వైకాపా, ఒకసారి జనతా పార్టీ గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి శివానందరెడ్డిపై వైకాపా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం వైకాపా నుంచి మరోసారి పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా, తెదేపా నుంచి బైరెడ్డి శబరి బరిలో నిలిచారు.

  • నంద్యాల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు

1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాయసం శేషగిరిరావు (కాంగ్రెస్‌) గెలుపొందారు. అనంతరం 1967: పెండేకంటి వెంకటసుబ్బయ్య (కాంగ్రెస్), 1971: పెండేకంటి వెంకటసుబ్బయ్య (కాంగ్రెస్), 1977: నీలం సంజీవరెడ్డి (జనతాపార్టీ), 1980: పెండేకంటి వెంకటసుబ్బయ్య (కాంగ్రెస్ (ఐ)), 1984: మద్దూరు సుబ్బారెడ్డి (టీడీపీ) విజయం సాధించారు.

గత ఎన్నికల్లో విజేతలు- సమీప ప్రత్యర్థులు

  • 1989: బొజ్జా వెంకటరెడ్డి (కాంగ్రెస్) - మద్దూరు సుబ్బారెడ్డి (టీడీపీ)
  • 1991: గంగుల ప్రతాపరెడ్డి (కాంగ్రెస్) - చల్లా రామకృష్ణా రెడ్డి (టీడీపీ)
  • 1991: (ఉప ఎన్నిక) పీవీ నరసింహరావు (కాంగ్రెస్) - బంగారు లక్ష్మణ్ (బీజేపీ)
  • 1996: పీవీ నరసింహరావు (కాంగ్రెస్) - భూమానాగిరెడ్డి (టీడీపీ)
  • 1996: (ఉప ఎన్నిక) భూమానాగిరెడ్డి (టీడీపీ) - పీ.వీ.రంగయ్యనాయుడు (కాంగ్రెస్)
  • 1998: భూమా నాగిరెడ్డి (టీడీపీ) - గంగుల ప్రతాపరెడ్డి (కాంగ్రెస్​)
  • 1999: భూమానాగిరెడ్డి (టీడీపీ) - గంగుల ప్రతాపరెడ్డి (కాంగ్రెస్​)
  • 2004: ఎస్పీవై.రెడ్డి (కాంగ్రెస్) - శోభా నాగిరెడ్డి (టీడీపీ)
  • 2009: ఎస్పీవై రెడ్డి (కాంగ్రెస్) - నాస్యం మహ్మద్​ ఫరూఖ్ (టీడీపీ)
  • 2014: ఎస్పీవై రెడ్డి(వైఎస్సార్సీపీ) - నాస్యం మహ్మద్​ ఫరూఖ్ (టీడీపీ)
  • 2019: బ్రహ్మానందరెడ్డి (వైఎస్సార్సీపీ) - మండ్ర శివనాథ రెడ్డి (టీడీపీ)

ABOUT THE AUTHOR

...view details