తెలంగాణ

telangana

ETV Bharat / politics

హాన్ నది తరహాలో మూసీ సుందరీకరణ - అందర్నీ ఒప్పించి, మెప్పించే పునరుద్ధరణ' - TELANGANA TEAM VISIT HAN RIVER

దక్షిణ కొరియా రాజధాని సియోల్​లో పర్యటిస్తున్న రాష్ట్ర బృందం - మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం హాన్​ నది పరిశీలన - ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తామన్న పొంగులేటి

MUSI RENAISSANCE IN HYDERABAD
MINISTER PONGULETI SOUTH KOREA VISIT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 3:52 PM IST

Updated : Oct 23, 2024, 2:49 PM IST

Telangana team visit South Korea : దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు, అధికారులు, జర్నలిస్టులు ఆ దేశంలోని ముఖ్యమైన హాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. సియోల్‌లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నది సియోల్​ నగరంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది.

సియోల్​లో తెలంగాణ రాష్ట్ర బృందం (ETV Bharat)

పునరుజ్జీవ కార్యక్రమంలో ప్రైవేట్ అభివృద్ధి పనులను నియంత్రించి, పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించి, పర్యాటక ఆకర్షణలుగా నది ప్రదేశాలను అభివృద్ధి చేయడం వంటి చర్యలు సియోల్ నగరపాలక సంస్థ చేపట్టింది. ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారిన హాన్‌ నది ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా, జలవనరుగా మారింది.

సియోల్​ నగరంలో హాన్​ నది: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు, అధికారులు ఇవాళ ఆ దేశంలోని ముఖ్యమైన హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్​ను సందర్శించారు. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది. ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారిన హాన్ నది ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా, జలవనరుగా మారింది. ఈ క్రమంలో దశల వారీగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని, పరీవాహకంలో నివసించే ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా - మూసీ ప్రక్షాళన చేసి తీరతాం : సీఎం రేవంత్‌ రెడ్డి - CM Revanth Slams On KCR

ప్రతి పక్షాలకు భయం: అందర్నీ ఒప్పించి, మెప్పించి మూసీ పునరుజ్జీవనం చేపడతామని సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవనం అనేది ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టు అని అభివర్ణించారు. బాధితులకు సాయంపై ప్రభుత్వం ముందే ఆలోచించిందని వేం నరేందర్‌ రెడ్డి చెప్పారు. సీఎం చేసే పనుల ఫలితాలపై ప్రతిపక్షాలు భయంతో ఉన్నాయన్నారు. పేదల ఇష్టానికి వ్యతిరేకంగా తాము ఏ ఒక్క పనీ చేయట్లేదన్నారు.

గత ప్రభుత్వమే పేదలపై ఉక్కుపాదం మోపిందని బీఆర్​ఎస్​పై మండిపడ్డారు. 1600 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు ఇచ్చే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళుతుందని పేర్కొన్నారు. మూసీ బాధితులకు ఆర్థికంగా రూ.2 లక్షల సాయం చేస్తామని, పరీవాహక ప్రజల పునరావాసానికి అండగా ఉంటామని తెలిపారు. ఏ ఒక్కరికీ నష్టం కలిగించే పని ప్రభుత్వం చేయదని వేం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

దిల్లీకి మూటలు పంపేందుకు మూసీపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు : కేటీఆర్

మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తాం : పొన్నం

Last Updated : Oct 23, 2024, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details