MP Balasauri on Joining in Janasena: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని, అందుకే ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నానని ఎంపీ బాలశౌరి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రయాణం చేయటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో రెండు గంటలు భేటీ అయ్యి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. తర్వలో మంచి ముహూర్తం చూసి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని చెప్పారు.
పవన్ కల్యాణ్ విధి విధానాలు బాగున్నాయన్న ఆయన పోలవరం ప్రాజెక్టును తర్వలో పూర్తిచేసి రైతులకు అంకితం చేయడమే తన ధ్యేయం అని స్పష్టం చేశారు. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ తన గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. 2024 సార్వత్రికలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు బాలశౌరి సమాధానం దాటవేశారు.
స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను - త్వరలో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే ఆర్థర్
"రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ విధి విధానాలు బాగున్నాయి. అందుకే ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో రెండు గంటలు భేటీ అయ్యి రాష్ట్రంలో తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపాం. త్వరలో మంచి ముహూర్తం చూసి ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరతాను. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ తన గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. పోలవరం ప్రాజెక్టును తర్వలో పూర్తిచేసి రైతులకు అంకితం చేయడమే నా ధ్యేయం.ఈ నేపథ్యంలో మా కుటుంబ దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందాను" - వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు