ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాజ్యసభలో రామ్మోహన్‌నాయుడిపై సుధామూర్తి మాతృప్రేమ - ఏం జరిగిందంటే - SUDHA MURTHY GAVE WATER TO RAMMOHAN

రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి దాహం - మంచినీళ్లు ఇచ్చిన ఎంపీ సుధామూర్తి

Rammohan Naidu Thanks To MP Sudha Murthy
Rammohan Naidu Thanks To MP Sudha Murthy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 12:20 PM IST

Minister Rammohan Naidu Thanks To MP Sudha Murthy :పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెద్దలసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడుపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి చూపిన అమ్మ ప్రేమకు రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ హర్షం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే

MP Sudha Murthy Gave Water to Rammohan Naidu :కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు గురువారం రాజ్యసభలో భారతీయ వాయు యాన్‌ విధేయక్‌ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ దాహార్తికి గురయ్యారు. మంచి నీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ (Deputy Chairman Harivansh)ను రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఆయన స్పందించి నీరు తెమ్మని సిబ్బందిని ఆదేశించారు.

సభ్యుల అభినందనలు : అయితే వారు తెచ్చేలోపు సుధామూర్తి తన వద్ద ఉన్న మంచి నీళ్ల సీసాను స్వయంగా తెచ్చి రామ్మోహన్‌ నాయుడికి అందించారు. ఆమె వాత్సల్యానికి ముగ్ధుడైన రామ్మోహన్‌ ఆమెకు రెండు చేతులతో నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఎప్పుడూ తన పట్ల తల్లిలా ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా రామ్మోహన్‌ ఇచ్చిన సమాధానానికి పలువురు సభ్యులు ఆయనను అభినందించారు.

చరణ్​కు ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రశంస

ఆ సినిమాలో ఆమె నటనకు కన్నీళ్లు వచ్చాయి : సుధామూర్తి

ABOUT THE AUTHOR

...view details