MP Rammohan Naidu Fire on YSRCP Government :ఏ-1 ఏపీలో ముఖ్యమంత్రిగా, ఏ-2 రాజ్యసభలో సభ్యుడిగా కూర్చుని ఉంటే ఎలా అభివృద్ధి సాధించగలమని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. శుక్రవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావు, చరణ్‌సింగ్, ఎం.ఎస్. స్వామినాథన్‌కుభారతరత్న (Bharat Ratna) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి రామ్మోహన్ నాయడు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)కు భారతరత్న ప్రకటించాలని తెలుగు ప్రజల తరఫున కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్న - నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
MP Ram Mohan Demands Bharat Ratna For NTR :"2014కి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారు. అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2004 నుంచి 2014 వరకు ఏపీని అవినితీ రాజు పాలించారు. ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఆయన ఆస్తులు రూ. 1.70 కోట్లు. 2004 నుంచి 2011 మధ్యలో ఆయన ఆస్తులు రూ. 356 కోట్లకు పెరిగాయి. 7 ఏళ్లలో ఇంత వృద్ధి సభలోని సభ్యులకూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈడీ, ఐటీ, సీబీఐ కూడా ఆశ్చర్యపోయాయి. అందుకే రూ. 43 వేల కోట్లు అటాచ్ చేశాయి. ఆయనపై 32 కేసులు నమోదు చేశాయి. రూ. 43 వేల కోట్లు పేపర్‌పై రాయమని చెబితే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా చాలామందికి తెలియదు. అందుకే ఏపీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడిని సీఎంగా ఎన్నుకున్నారు. మోదీని ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు." అని రామ్మోహన్ నాయడు అన్నారు.