MP Kalisetti Responds Allegations On Margadarsi:మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎంతో మంది జీవితాల్లో అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి ఉపయోగపడుతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్పై ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తన తండ్రి పెద్దిరెడ్డి అరాచకాలను ఈనాడు వార్తా సంస్థ ఆధారాలతో ప్రచురిస్తున్నందుకే మిథున్ రెడ్డి మార్గదర్శిపై కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 1995లోనే తాను మార్గదర్శిలో సభ్యుడిగా చేరానని ఇప్పటికీ పలువురు కుటుంబ సభ్యులు మార్గదర్శిలో చిట్స్ కడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.
మార్గదర్శిపై 2006లో ఇదే విధంగా తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేసుకున్నాడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుదారులతో సహా వేలాది మంది ప్రజలు శ్రీకాకుళం జిల్లాలో సంస్థకు మద్దతుగా ర్యాలీ చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు ఉన్నప్పటికీ, మారదర్శి సమాజంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు చేసేవారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనాడు, మార్గదర్శి వంటి సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.