MLA Yarlagadda Venkata Rao Comments on Jagan:అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్‌రెడ్డి ప్రజాదర్బార్ పేరిట స్వీకరించిన వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండానే మైక్ సరిగా ఇవ్వరంటూ అడ్డగోలుగా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఏ హోదా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభకు, రాజ్యసభకు వెళుతున్నారో చెప్పాలని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసలు వేదికైన అసెంబ్లీని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వినియోగించుకోట్లేదని విమర్శించారు.
విజయవాడలో వంగవీటి మోహన్ రంగా వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 11 మందికి ఓటేసి గెలిపించిన ప్రజలపై కూడా జగన్ దాడి చేస్తున్నాడని యార్లగడ్డ మండిపడ్డారు. అసెంబ్లీని చూడకుండానే ఐదేళ్లు గడిచిపోతాయేమో అని ఆ 11మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, శాసనసభను అవమానించటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని అన్నారు. ప్రజలు ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే దానికి తామేం చేయాలని ప్రశ్నించారు. జగన్ శాసనసభనే అవమానిస్తున్నాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
బెనిఫిట్ షో, టికెట్ ధరలు చిన్న విషయాలు - సినీ ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్ మా లక్ష్యం : దిల్‌రాజు