Minister Tummala Nageswara Rao in CPM Meeting: దేశ రక్షణ, భవిష్యత్తు, గౌరవం కోసం కేంద్రంలో సీపీఎం ఇండియా కూటమిలో చేరి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Minister Tummala on Compensation to Farmers : దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌లు) చూస్తున్నాయని మంత్రి తుమ్మల ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందు మహిళల పుస్తెలు గుంజుకుని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని మండిపడ్డారు. ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. రైతు బంధు నాలుగైదు రోజులలో అందరికీ వస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల కురుసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఎన్నికల కమిషన్ శనివారం అనుమతి ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
జొన్నరైతులకు గుడ్న్యూస్ - మద్దతు ధరకు ప్రభుత్వమే పంట కొనుగోలు - Govt Focus On Sorghum Procurement