తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 4:56 PM IST

ETV Bharat / politics

'సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి​ పెట్టుబడులు తీసుకొస్తుంటే - బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేకపోతున్నారు' - Minister Ponnam on CM USA Tour

Minister Ponnam Fire on BRS : రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బృందం విదేశాలకు వెళ్తే బీఆర్ఎస్​ నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం కుటుంబానికి సంబంధించిన అంశాలను తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.​

Minister Ponnam on CM Revanth USA Tour
Minister Ponnam Fire on BRS (ETV Bharat)

Minister Ponnam on CM Revanth USA Tour :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే బీఆర్​ఎస్​ నాయకులు ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు రైతు వేదికలో గురువారం రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే, బీఆర్​ఎస్​ నాయకులు సీఎం కుటుంబపరమైన అంశాలను తీసుకువచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సుంకిశాలపై సమగ్ర విచారణ :గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ఒక్కసారి కూడా విదేశాలకు వెళ్లలేదని, ఈ విషయమై బీఆర్​ఎస్​ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ అనుకూల పత్రికలో సుంకిశాల గోడ విరిగిపడిందని, దానితో లింకు పెడుతూ తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల బీఆర్​ఎస్ హయాంలో చేసిన తప్పిదమని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్​ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాలను తమ ప్రభుత్వం సరి చేసుకుంటూ వస్తుంటే, గులాబీ నాయకులు ఓర్వలేక తమపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షంగా సలహాలిస్తే స్వీకరిస్తాం :ప్రతిపక్షంగా బీఆర్ఎస్​ నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తాం కానీ బట్టకాల్చి మీద వేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం తమది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్​ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ కానీ వారి పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడడం చేతగాని కేంద్రమంత్రి ఆయన అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ కాకపోతే లోపాలను సవరణ చేసుకునే అవకాశం రైతులకు ఇస్తున్న ప్రభుత్వం తమదని గుర్తుంచుకోవాలన్నారు.

'రాష్ట్ర పెట్టుబడుల కోసం సీఎం రేవంత్​ బృందం అమెరికా పర్యటనకు వెళ్తే బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ప్రస్తుత సీఎం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరుని రాష్ట్ర ప్రజలు గమనించాలి'-పొన్నం ప్రభాకర్​, మంత్రి

సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై దుష్ప్రచారం : సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై బీఆర్​ఎస్​ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంపత్‌కుమార్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కేటీఆర్‌ స్వాగతిస్తే, బాల్కసుమన్‌, క్రిశాంక్‌ విభేదించడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇంకా ఏ కంపెనీతోనూ ఒప్పందాలు చేసుకోలేదన్న సంపత్‌కుమార్‌ తమ హయాంలో ఫక్తు కుటుంబపాలన సాగించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వంపై బురదజల్లడం మాని బాధ్యతగా వ్యవహరించాలని చురుకలు అంటించారు.

ఉచిత బస్సు పథకంపై కావాలనే అవహేళన వీడియోల ప్రచారం : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON FREE BUS VIDEOS

ABOUT THE AUTHOR

...view details