Minister Ponnam Bandi Sanjay Clash Update : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన ప్రజాహిత యాత్రలో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్(Bandi Sanjay vs Minister Ponnam) మధ్య అగ్గిరాజేశాయి. వీరిద్దరి మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలతో కరీంనగర్ రాజకీయం రంజుగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ శ్రేణులు సైతం బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. అయితే తాజాగా మరోసారి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బండి వ్యాఖ్యలపై స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
"గంగుల కమలాకర్, బండి సంజయ్ ఎన్నికల్లో కుమ్మక్కు అయ్యారు. నేను రాముడి గురించి చెడ్డగా మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధం. రాముడిని ఆరాధిస్తా, నేను పక్కా హిందువును. రాముడిని ఆరాధిస్తున్నానని చెప్పి మీరు దేవుడినే రాజకీయాల్లోకి లాగుతారా? హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నిస్తే నా తల్లి గురించి మాట్లాడతారా? మళ్లీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో హుస్నాబాద్ చౌరస్తాలో ఆయురారోగ్యాలతో ఉన్న నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడతారా? తల్లిని ఎవరైనా రాజకీయాల్లోకి లాగుతారా చెప్పండని తెలంగాణ ప్రజలు, బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నాను. మీరు ఎంపీగా గెలిస్తే నన్ను మంత్రికి పదవికి రాజీనామా చేయమంటున్నారు. మీరు ఇప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరి ఎంపీ పదవికి రాజీనామా చేశారా?" - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి
కరీంనగర్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్