ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్ - Nara Lokesh on YS Jagan - NARA LOKESH ON YS JAGAN

Minister Nara Lokesh on YS Jagan Dharna in Delhi: దిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌పై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. 36 మందిని చంపేశారని చిరునవ్వుతో ధర్నా చేస్తున్న జగన్ మృతుల పేర్లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చు కదా జగన్‌ రెడ్డి అని ప్రశ్నించారు.

nara_lokesh_on_ys_jagan
nara_lokesh_on_ys_jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 6:56 PM IST

Minister Nara Lokesh on YS Jagan Dharna in Delhi:దిల్లీలో ధర్నా చేస్తున్న వైఎస్సార్​సీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేశ్ చురకలు అంటించారు. 36 మందిని చంపేశారని చిరునవ్వుతో ధర్నా చేస్తున్న జగన్ రెడ్డి మృతుల పేర్లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్ల పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చు కదా జగన్‌ రెడ్డి అని ప్రశ్నించారు. మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్‌ను, మాస్క్ వేసుకోలేదని కిరణ్‌ని, జే-బ్రాండ్స్ దోపిడీని ప్రశ్నించాడని ఓం ప్రతాప్‌ని, గంజాయి మాఫియా గుట్టు రట్టు చేస్తాడని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయ్ వివేకాను చంపారుగా వారి పేర్లు చెప్పేయ్ ఫేకు జగన్ అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details