Minister Nara Lokesh Gift To Brahmani in the Occasion of Sankranti :ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుకల సందర్భంగా అపురూపమైన కానుక ఇచ్చారు. మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు.
ఈ పోస్టును నారా బ్రాహ్మణి రీపోస్టు చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.