ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పార్థసారధి - MINISTER PARTHASARATHI ON HOUSES

మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం - లబ్ధిదారులకు ఫిబ్రవరి 1న సీఎం చేతులమీదుగా ఇళ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందని వెల్లడి

minister_parthasarathi_on_houses
minister_parthasarathi_on_houses (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 6:03 PM IST

Minister Parthasarathy on Houses Distribution: అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. 6 నెలల్లో 1.14 లక్షల ఇళ్లు నిర్మించామన్న మంత్రి ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇళ్లు అప్పగిస్తారని తెలిపారు. పీఎంఎవై కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.వేల కోట్లు దారి మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గృహనిర్మాణానికి 6 నెలలలో రూ.502 కోట్లు ఖర్చు చేశామని మంత్రి పార్థసారధి వెల్లడించారు.

గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇస్తామని మంత్రి పార్థసారధి వెల్లడించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని అన్నారు. అలానే విజయసాయి రెడ్డి రాజీనామాపై మంత్రి స్పందించారు. ఆయనకి చేసిన తప్పులు తెలుసు కాబట్టే రాజీనామా చేశారని విమర్శించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అంతా ఖాళీ అవుతుందని పార్థసారధి అన్నారు.

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పార్థసారధి (ETV Bharat)

కూటమి ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించాము. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. లబ్ధిదారులకు ఫిబ్రవరి 1న తణుకు మండలం తేతలిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గృహ నిర్మాణానికి 6 నెలలలో రూ.502 కోట్లు ఖర్చు చేశాము. పీఎంఎవై కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇస్తాము. ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తాము.-పార్థసారధి, మంత్రి

పిల్లలపై రాజకీయాలు చేయొద్దు - వారి రక్షణ మా బాధ్యత: మంత్రి అనిత

'ప్రతి మాట గుర్తుంది-అస్సలు వదిలిపెట్టం' - విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్

ABOUT THE AUTHOR

...view details