Mallela Rajesh Naidu Allegations on Sajjala and Vidadala Rajini: ఎన్నికల నోటీఫికేషన్ రానున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల టికెట్ మార్పుల ఆందోళన మెుదలైంది. ఇప్పటికే టికెట్ దక్కి, ప్రచారంలో దూసుకుపోతున్న నేతలకు, వైఎస్సార్సీపీ అధిష్టానం పలు చోట్ల షాక్ ఇస్తుంది. అప్పటి వరకూ తానే ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్న నేతల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడి పోరుతో ఆందోళన మెుదలైంది. టికెట్ ప్రకటించిన అభ్యర్థులను సైతం మారుస్తారనే ప్రచారంతో, వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపైకి వస్తున్నారు. ఆందోళనతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల సమావేశం పెట్టిమరీ మంత్రులు, వైఎస్సార్సీపీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం: పల్నాడు జిల్లాచిలకలూరిపేట వైఎస్సార్సీపీలో ముసలం మెుదలైంది. మంత్రి రజిని, వైఎస్సార్సీపీ అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నాయుడు మంత్రి రజిని, సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేష్ ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం మెుదలవడంతో, ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి రజిని తన వద్ద రూ. 6.5 కోట్లు తీసుకున్నారని రాజేష్ ఆరోపించారు. డబ్బుల విషయమై సజ్జలకు చెబితే, కేవలం రూ. 3 కోట్లు వెనక్కు ఇప్పించారని రాజేష్ పేర్కొన్నారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కార్యకర్తలు ముందు సజ్జలను మార్చాలి, పార్టీని బతికించాలంటూ విజ్ఞప్తి చేశారు.
మేనిఫెస్టో హామీలు విస్మరించిన జగన్ 100 పథకాలు రద్దు చేశాడు : నారా లోకేశ్