ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నా - గెలిస్తే మరింత సంక్షేమం: లోకేశ్​ - YCP leaders who joined TDP

Lokesh Met Mangalagiri Constituency Leaders: మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో లోకేశ్ సమక్షంలో 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాల నాయకులతో లోకేశ్​ విడివిడిగా భేటీ అయి చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

nara_lokesh
nara_lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 7:37 PM IST

సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నా - ఎన్నికల్లో గెలిస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తా: లోకేష్

Lokesh Met Mangalagiri Constituency Leaders:తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu Naidu) ప్రకటించిన సూపర్-6 హామీలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)​ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన నాయకులతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలోని రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నేతలు లోకేశ్​ దృష్టికి తీసుకొచ్చారు.

మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, స్వర్ణకారులు, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పని తీరు ప్రామాణికంగానే పదవులు ఇస్తామని కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా తన సొంత నిధులతో మంగళగిరిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నానని, గెలిస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తామన్నారు.

విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు

60 Families and YCP Leaders Joined TDP:మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు యువనేత లోకేశ్​ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ అధ్వర్యంలో మంగళగిరి పట్టణ వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మరో 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి యువనేత నారా లోకేశ్ ​పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు, లోకేశ్​ను కలుస్తున్న ఆశావహులు - భవిష్యత్తు చూసుకుంటానంటూ భరోసా

2000 People Joined TDP from YCP in Kodumuru Constituency:వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలోని కళ్లపరి గ్రామ సర్పంచ్ రంగమ్మ ఆధ్వర్యంలో 2000 మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు బొగ్గుల దస్తగిరిని నియమించారని ఆయన కృషికి కోడుమూరు నియోజవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.

వైసీపీ హయాంలో సంక్షేమం పేరుతో గ్రామాలను సంక్షోభానికి నెట్టారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు వారి సమస్యలు గొంతు విప్పి చెప్పుకునే పరిస్థితి లేదందున వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.

'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా

ABOUT THE AUTHOR

...view details