తెలంగాణలో ప్రచారం పరుగులు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీ (Etv Bharat) Lok Sabha Election Heat in Telangana : ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో తొలిసారి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తీరిక లేకుండా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Election Campaign in Telangana: మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌కు మద్ధతుగా సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి మంత్రి తుమ్మల హజరయ్యారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్ధతుగా నిలవాలని ఎన్‌ఆర్‌ఐలను కొరుతూ మాజీమంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రచార బరిలోకి కాంగ్రెస్ అగ్రనేతలు - పూర్తి షెడ్యూల్ ఇదే - lok sabha elections 2024
BRS Leaders Election Campaign : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. చేవెళ్ల లోక్‌సభ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్ధతుగా రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాజీమంత్రి తలసానితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాలోత్ కవితకు మద్ధతుగా నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేశారు.
BJP Election Prachar in Telangana 2024 : సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎంపీ లక్ష్మణ్ పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. కరీంనగర్‌లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోమారు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మాజీగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల ప్రచారం చేశారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాధవీలతతో పాటు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎన్ని జిమిక్కులు చేసినా - బీజేపీ అభ్యర్థుల గెలుపు పక్కా : ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman Election Campaign
ఎన్నికల ప్రచారం వయా సోషల్ మీడియా - ఫేస్బుక్, యూట్యూబ్ కాదేది ప్రచారానికి అనర్హం - Election Campaign In Social media