తెలంగాణ

telangana

ETV Bharat / politics

తెలంగాణలో వచ్చిన మార్పు - బీఆర్​ఎస్​ నేతలను హత్య చేయడమేనా? : కేటీఆర్ - KTR in MLC By Election Campaign - KTR IN MLC BY ELECTION CAMPAIGN

KTR in Graduates MLC Election Campaign : తెలంగాణలో కాంగ్రెస్​ రంగుల సినిమా లాంటి కలలు చూపించారని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం హయాంలో మార్పు వచ్చిందన్నారు కానీ ఆ మార్పు బీఆర్​ఎస్​ కార్యకర్తల హత్యలు అంటూ ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రి కేటీఆర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

KTR in Graduates MLC Election Campaign
KTR in Graduates MLC Election Campaign (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:13 PM IST

KTR Meeting at Nalgonda : కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో మార్పు వచ్చిందన్నారు - వచ్చిన మార్పు ఇద్దరు బీఆర్​ఎస్​ కార్యకర్తలను హత్య చేయడమేనా అంటూ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణలో రంగుల సినిమా లాంటి కలలు చూపించారని తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రి కేటీఆర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్​పై విమర్శలు చేశారు.

కాంగ్రెస్​ వచ్చాక మార్పు ఏందంటే పచ్చగా ఉన్న తెలంగాణలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్​ ధ్వజమెత్తారు. కేసీఆర్​ ఉన్న రోజులు కరెంటు పోకుండా ఉంటే, ఇప్పుడేమో కరెంటు ఎప్పుడు పోతుందో చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రూ. లక్ష రుణమాఫీ చేస్తే, తాను రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని దుయ్యబట్టారు. క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తానని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తానని చెబుతున్నారన్నారు.

తీన్మార్​ మల్లన్నపై అందుకే కేసులు : కాంగ్రెస్​ ప్రభుత్వం డొల్లతనం దివాళాకోరు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్​ మండిపడ్డారు. తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇక్కడ టాక్స్​లు వసూలు చేసి వాళ్ల దిల్లీ పెద్దలకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిస్తే కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను గట్టిగా అడగొచ్చని చెప్పారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్​, బ్లాక్​ మెయిలింగ్​, దందాలు, అనుమతి లేకుండా ఫొటోలు పెట్టడం వంటివి చేసినందుకే తీన్మార్​ మల్లన్నపై కేసులు పెట్టారని తెలిపారు. తెల్లారి లేస్తే నోరు పారేసుకునే వ్యక్తి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్​ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఓయూ, కేయూ విద్యార్థులకు ఎమ్మెల్యే టికెట్​ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున నిలదీసే నాయకులు రాకేశ్​ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కేటీఆర్​ పట్టభద్రులను కోరారు.

వైద్య రంగంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవం : కేటీఆర్ - KTR Tweets On Health Sector

కాంగ్రెస్​ మార్పంటే కరెంటు కోతలు, ఐటీ కంపెనీల తరలింపు : కేటీఆర్​ - KTR Comments on CM Revanth Reddy

ABOUT THE AUTHOR

...view details