KTR Election Campaign in Nalgonda: 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్లు ఉండాలి ఆయన సూచించారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతుందని విమర్శించారు. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించి బతికేవాళ్లకు ఓటు వేయవద్దని సూచించారు.
KTR Shocking Comments on Teenmar Mallanna: ఎన్నికలకు ముందు 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామిని అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలంటే నిలదీసే వ్యక్తి, ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి ఓటు వేస్తారో, లేక బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తికి ఓటు వేస్తారో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది : కేటీఆర్ - MLC Election KTR Campaign
KTR Fires on Congress : అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటు వేద్దామా అని కేటీఆర్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
"6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించి బతికేవాళ్లకు ఓటు వేయవద్దు. 56 క్రిమినల్ కేసులున్న వ్యక్తికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. పరీక్షలకు ఫీజు వసూలు చేయమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెబుతున్న నాయకులకి బుద్ధి చెప్పాలి. పట్టుభద్రుల ఆలోచించి ఓట్ వేయండి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి ఓటు వేస్తారో బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తికి వేస్తారో ఆలోచించండి : కేటీఆర్ (ETV Bharat) కాంగ్రెస్ బోనస్ హామీ బోగస్ - మరో గ్యారంటీని తుంగలో తొక్కారు : కేటీఆర్, హరీశ్ రావు ఫైర్ - KTR ON BONUS FOR PADDY IN TELANGANA