Korukanti Chandar Fires On Congress :అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్ధతుగా ఆయన పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40,41వ డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
Koppula Eswar Election Campaign :డివిజన్లో ఇంటింటికీ తిరుగుతూ గత బీఆర్ఎస్ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఎండగడుతూ ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రశ్నించే గొంతుకైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గాదం విజయతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీహామీలు నెరవేరాలంటే కొప్పుల గెలవాలి :కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే వారిపై ప్రశ్నించేందుకు కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు రెండు లక్షల మందిని ప్రభావితం చేస్తారన్నారు. కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా చెబుతుందన్నారు. ఓటు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గెలిపించిన ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని కోరారు.