తెలంగాణ

telangana

ETV Bharat / politics

మునుగోడు గడ్డ - కాంగ్రెస్ అడ్డా : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి - Komati Reddy Rajagopal Reddy Speech

Komati Reddy Rajagopal Reddy Election Campaign : గతంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అభివృద్ధిపై పోరాడినా లాభం లేకపోవడంతో పదవికి రాజీనామా చేశానని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేస్తున్నామని అన్నారు. నల్గొండ జిల్లాలోని మునుగోడులో నిర్వహించిన రోడ్​ షోలో ఆయన పాల్గొన్నారు.

Congress Leaders Pracharam in Munugode
Komati Reddy Rajagopal Reddy Speech

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 3:10 PM IST

Updated : Apr 30, 2024, 3:16 PM IST

Komati Reddy Rajagopal Reddy Election Campaign: మునుగోడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. మునుగోడు గడ్డ, కాంగ్రెస్​ అడ్డా అని అన్నారు. భువనగిరి లోక్​సభ నియోజకవర్లం పరిధిలో కాంగ్రెస్​ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్​ షో నిర్వహించగా, దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Congress Leaders Campaign in Nalgonda: గతంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అభివృద్ధిపై పోరాడినా లాభం లేకపోవడంతో పదవికి రాజీనామా చేశానని కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో తనను ఒక్కడినే ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి వేలకోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు కేవలం తనను చూసే ఓటు వేశారని, బీజేపీ పార్టీకి కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు చామల కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాధ్యత అప్పగించారని అన్నారు. అది నెరవేర్చడం మనందరిపై ఉందని తెలిపారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం రాజ్యాంగాన్నే మార్చేస్తుంది :మంత్రి పొన్నం - Minister Ponnam Fires On BJP

Rajagopal Reddy Comments : కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్​, రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ అమలు చేస్తున్నామని రాజగోపాల్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దొరలకు అప్పగించామని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు తప్పా ఏ పార్టీకి ఓటేసిన అది కమలం పార్టీకే వేసినట్టేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితర నాయకులు పాల్గొన్నారు.

"మునుగోడు గడ్డ, కాంగ్రెస్ అడ్డా. మునుగోడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాజన్న ముందు ఉంటాడు. ఉప ఎన్నికల్లో నన్ను ఒక్కడిని ఓడకొట్టడానికి వంద మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి వేల కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కూడా ప్రజలు కేవలం నన్ను చూసి ఓటు వేశారు. బీజేపీ పార్టీని చూసి కాదు." - కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి, ఎమ్మెల్యే

మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

నేను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి - komatireddy React on KCR Bus Yatra

కారు షెడ్​కు కాదు స్క్రాప్​ కింద దొంగలు అమ్మేసుకున్నారు : కోమటిరెడ్డి

Last Updated : Apr 30, 2024, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details