ప్రతిపక్ష నేత హోదాకు తగిన ఛాంబర్ కేటాయించాలి - మాజీ మంత్రి వేముల విజ్ఞప్తి KCR Room Changed in Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర శాసనసభ లాబీలో ప్రతిపక్ష నేత గదిని మార్చారు. ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ద్వారం వద్ద ప్రతిపక్షనేతకు గది ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా ఏళ్లుగా ఇది కొనసాగుతూ వస్తోంది. డిసెంబర్‌లో జరిగిన సమావేశాల సమయంలోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఈ గదిని ఉపయోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు(Opposition Leader) ఆ గది కాకుండా మరొకటి కేటాయించారు.
Telangana Opposition Leader Room in Assembly :సభాపతికి సరిపడా గదులు లేనందున గతంలో ప్రతిపక్ష నేతకు ఇస్తూ వచ్చిన గదిని కూడా స్పీకర్ వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఆ గదికి ఇన్నర్ లాబీల వైపు ఉండే ద్వారాన్ని మూసివేశారు. లాబీల్లో ఆయా శాసనసభ పక్షాలకు ఇచ్చే గదుల్లో ఒక గదిని ప్రస్తుతం ప్రతిపక్ష నేతకు కేటాయించారు. విపక్షనేత హోదాలో కేసీఆర్‌కు(KCR) ఒక గదిని, ఆ పక్కనే భారత్ రాష్ట్ర సమితి శాసనసభ పక్షానికి మరొక గదిని కేటాయించారు. బీజేపీ, మజ్లిస్ శాసనసభాపక్షాలకు కూడా ఒక్కొక్క గదిని కేటాయించారు. ఈ మేరకు కేసీఆర్ సహా మూడు పార్టీల గదులకు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై
అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్‌కు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్(BRS) మండిపడుతోంది.శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం ప్రతిపక్ష నేత హోదాను తగ్గించడం, అవమానపరచడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పీకర్ కోరిక మేరకు అసెంబ్లీ(Asssembly)లో ప్రతిపక్ష నేతకు ఇచ్చే ఛాంబర్‌ను వదులుకున్నామని, దానికి ప్రతిగా ఒక చిన్న గది ఇవ్వటం సమంజసం కాదన్నారు. గతంలో ఉన్న గదికి సమానంగా మరొక చోట ప్రతిపక్ష నేతకు గది ఇవ్వాలని కోరామని తెలిపారు. కానీ నాలుగో వంతు కూడా లేని గదిని కేటాయించారని వెల్లడించారు. ప్రతిపక్షనేత హోదాకు తగ్గ గది కేటాయించాలని సభాపతిని కోరామని, పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
"బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో తగిన ప్రోటోకాల్ కల్పించడంలేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సంగారెడ్డిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి భార్య కోసం ఎమ్మెల్యే ప్రభాకర్‌ను రెండు గంటలు ఆపారు. సంగారెడ్డి ఆర్‌డీఓపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరాం. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారుతుంటారు. కానీ శాసససభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ప్రొటోకాల్ ఎస్కార్ట్ విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహారించవద్దని సీఎస్, డీజీపీని కోరుతున్నాం. సానుకూలంగా స్పందిస్తే సరి లేదంటే తగిన రీతిలో కార్యాచరణ తీసుకుంటాం." - వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి
నాలుగు రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
అప్పుడు తిట్టి, ఇప్పుడెలా నియమిస్తారు - టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించండి : ఎమ్మెల్సీ కవిత