Kandukur MLA Manugunta Mahidhar Reddy:రాష్ట్రంలో డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారని, తాజా పరిస్థితుల్లో రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని తెలిపారు. తన ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని పోటీలో నిలబడే అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కార్యకర్తలు ఆందోళన చెందవద్దు: కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద బాధితులకు మద్దతు కోసం వచ్చిన రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మాట్లాడారు. కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ కి వైఎస్సార్సీపీ సీటు వస్తుందా రాదా అనే సందిగ్ధత కొనసాగుతున్న పరిస్థితుల్లో పలు విషయాలను వివరించారు. తనను నమ్మిన కార్యకర్తలు ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. రాజకీయం తాను కావాలనుకుంటే దాటిపోయేది కాదని, కొనసాగాలనుకుంటే నన్ను ఆపేశక్తి ఎవరికీ లేదని అన్నారు.
వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారు: మహీధర్ రెడ్డి 'వారి సేవలు వద్దు' - పెద్దిరెడ్డికి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
కీలకంగా మారిన ఆర్థిక పరమైన అంశాలు: ఎన్నికల్లో నిలబడాలంటే ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకొని ముందు సాగాల్సిన అవసంరం ఉందని మహీధర్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న ఎన్నిల ఖర్చులు నేపథ్యంలో, పోటీలో నిలవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. యావత్ రాష్ట్రం డబ్బు వైపు నడుస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెడతారనే దానికే ప్రాధాన్యత ఉందని మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఒకపక్క అభిమానం ఉన్నా, ఆర్థిక పరమైన అంశం కూడా కీలకంగా మారాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక ఓనర్స్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నారు. 1972-89 మధ్య రాజకీయాల్లో ఇటువంటి ఆస్కారం లేదని తెలిపారు. మారుతున్నకాలంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైందని తెలిపారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా బలియమైన రాజకీయ ఆరంగ్రేటాకు బలియమైన శక్తి ఆర్థిక పరిస్ధితియే అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను సైతం తన ఆర్థిక పరిస్దితిని బేరీజు వేసుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రామాయపట్నం పోర్టు బాధితులకు అనుగుణంగా కలిసి వచ్చి అధికారులకు, వ్యతిరేక విధానాలు మత్స్యకారులకు చేస్తే ముందుండి నిలబడి పోరాటాన్ని నడిపిస్తా అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు లేకుండానే కార్యక్రమాలు - వైఎస్సార్సీపీ కొత్త ఇంఛార్జ్‌లే సర్వం
పెంచలయ్యకు టికెట్: తనకు టికెట్ కేటాయించే అంశంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పడకూడదని తెలిపారు. మెుదటి లిస్ట్‌లో తన పేరు లేకపోవడంపై స్పందించిన మహీధర్ రెడ్డి, ఆర్థిక పరిస్థితుల కారణంగా పోటీలో నిలబడే అశంపై నిర్ణయం తీసుకొవడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పెంచలయ్యకు టికెట్ ఇచ్చే అంశంపై సీఎం జగన్ తనను సంప్రదించారని పేర్కొన్నారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసిందని, పెంచలయ్య టికెట్ ఇస్తారా లేదా అనేది జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - రాచమల్లుకు టికెట్ ఇస్తే ఓటమే: శివచంద్రా రెడ్డి