బాండ్ పేపర్ రాసి మరీ అర్వింద్ మాట తప్పారు జీవన్‌రెడ్డి Jeevan Reddy Chai pe Charcha Program in Nizamabad: ప్రచారంలో ఎవరెటు తిరిగినా ఎన్నికల ప్రక్రియ ముగియగానే గ్రామస్థులు అందరూ ఐక్యంగా ఉంటారని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపల్లి జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం అంకపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 'చాయ్ పే చర్చ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Jeevan Reddy on Rythu Runa Mafi in Telangana : నిజామాబాద్ జిల్లాలోని అంకపూర్ రాష్ట్రంలోనే ఆదర్శమని, వ్యవసాయ రంగంలోని మెళకువలు ఈ ప్రాంతంలో నేర్చుకోవచ్చని జీవన్ రెడ్డి తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తుందని, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ కరెంట్ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయని, దానికి అనుగుణంగానే రాయితీలు పెంచారని, కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ ఇవ్వడం సాధారణ విషయమే అని అన్నారు.
నన్ను ఎంపీగా గెలిపిస్తే జక్రాన్‌పల్లికి పసుపు బోర్డు తీసుకొస్తా : జీవన్ రెడ్డి - MLC Jeevan Reddy Election Campaign
Jeevan Reddy Comments on BJP : రైతులకు రుణమాఫీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని జీవన్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు రుణమాఫీ చేయమంటే అదాని, అంబానీలకు మాత్రమే చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.
"ఎంపీ అరవింద్ గెలిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసి మాట తప్పారు. షుగర్ పరిశ్రమను తెరిపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అలాంటిది అరవింద్ ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఏమి చేశారు? 25 ఎకరాల్లో మామిడి మార్కెట్ పెట్టిన ఘనత నాది. కావాలంటే ఎంపీ అరవింద్ వచ్చి చూసుకోవాలి. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటాను." - తాటిపత్రి జీవన్ రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి
గడిచిన ఐదేళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిజామాబాద్‌లో అభివృద్ధి : జీవన్‌రెడ్డి - Jeevan Reddy On CM visit
జగిత్యాల చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్ - MP Arvind in Chai Pe Charcha