pawan kalyan cars : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా నామినేషన్ దాఖలు చేయాల్సిందే. తమపై నమోదైన కేసులు, ఆస్తుల పూర్తి వివరాలను అందులో వెల్లడించాల్సిందే. ఈ నేపథ్యంలో వేల కోట్లు కలిగిన పలువురు అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలిసి ఓటర్లు అవాక్కవుతున్నారు. కాగా, కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనపేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల కమిషన్‌కు నివేదించారు.
కాసేపట్లో పవన్‌కల్యాణ్ నామినేషన్ - పిఠాపురంలో భారీ ర్యాలీ - Pawan Kalyan Nomination With Rally
పవన్ వద్ద మొత్తం 11 వాహనాలు ఉన్నాయి. అందులో ఒకటి బైక్ కాగా మరొకటి పికప్ ట్రక్, మరో 9 కార్లు ఉన్నాయి. పవన్ 2010 సంవత్సరంలో హార్లే డేవిడ్ సన్ బైక్ కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ బైక్ ధర 32లక్షల 66వేల 536 రూపాయలు. ఆ తర్వాత 2011లో పవన్ ఆర్ క్లాస్ 360 మోడల్ బెంజ్ కారు కొన్నారు. దాని ధర 72లక్షల 95వేల 264 రూపాయలు. ఇక 2014లో మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్ 8 మోడల్ స్కార్పియోను 13లక్షల 82వేల 240 రూపాయలకు కొనుగోలు చేశారు. 2021లో టాటా యోధా పికప్ ట్రక్ తీసుకున్నారు. ఆ వాహనం ధర 9లక్షల 19వేల 098 రూపాయలు మాత్రమే. పవన్ వద్ద ఉన్న వాహనాల్లో అతి తక్కువ ధర దీనిదే కావడం గమనార్హం.