ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కొండా సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యాం - హీరో నాగార్జున వాంగ్మూలం - NAGARJUNA DEFAMATION ON SUREKHA

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌, పరువునష్టం దావా వేసిన హీరో నాగార్జున - నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున వెంట అమల, నాగచైతన్య

nagarjuna_defamation_on_surekha
nagarjuna_defamation_on_surekha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2024, 4:27 PM IST

Hero Nagarjuna Defamation Suit on Minister Konda Surekha:తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్​ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్​మెంట్ల‌ను సైతం నమోదు చేస్తోంది.

ఈ క్రమంలో పిటిషన్‌ ఎందుకు దాఖలు చేసారని నాగార్జునను ధర్మాసనం ప్రశ్నించగా... మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మంత్రి చేసిన కామెంట్స్ వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details