Temporary Bridge to veereswara swamy Temple Eluru District : శివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలను వైభవంగా ముస్తాబు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. అన్ని ఆలయాలలో భక్తులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పోలవరం ప్రాజెక్టు సమీపంలో అఖండ గోదావరి మధ్యలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు నదిపై పంట్లతో తాత్కాలిక వంతెన నిర్మించారు. మహాశివరాత్రి వేళ దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ సారి గోదావరిలో ఓ పాయ ప్రవహిస్తోంది.
అందులోంచి వెళ్లడం వీలు కాకపోవడంతో స్థానికులు పంట్లను ఒక దాని పక్కన ఒకటి పెట్టి వంతెనలా చేశారు తర్వాత ఆలయం వద్దకు వెళ్లేందుకు వీలుగా బస్తాల్లో ఇసుక నింపి దారిలా పేర్చారు. ఏలూరు జిల్లా పట్టిసీమ నడిచి చెంతనున్న గోదావరిలో ఈ వారధి నిర్మించారు. శివారాధనతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతుంది.
1008 కిలోల లడ్డూ బూందీతో శివలింగం - పెన్సిల్ మొనపై శివతాండవం