GV Reddy Comments on YSRCP Govt Irregularities in AP Fiber Net:ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అర్హతలేని వారిని ఫైబర్ నెట్లో నియమించిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. 410 మందిని తొలగిస్తున్నామని తెలిపారు. ఫైబర్ నెట్లో నియమితులైన వారంతా వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని, వీరందరికీ సంస్థ నుంచి వేల కోట్లు వేతనాలిచ్చి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు.
ఏపీ ఫైబర్ నెట్లో 410 మందిని తొలగిస్తున్నాం: ఛైర్మన్ జీవీరెడ్డి (ETV Bharat) గత ప్రభుత్వం అవినీతి అక్రమాల వల్ల ఎపీ ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని జీవీ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారురు. లాభాల్లో నడిచే సంస్థను గత ప్రభుత్వం నష్టాలు పాలు చేసిందని అన్నారు. ఫలితంగా ఎపీఎస్ఎఫ్ఎల్కు రూ.1200 కోట్లు అప్పులు పాలు చేయడంతో సహా రూ.900 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. తాము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదన్న అర్హత లేకుండా అక్రమంగా నియమితులైన ఈ ఉద్యోగులను తీయకపోతే సంస్థ రోడ్డున పడుతుందనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు.
'అమ్ముకుని సొమ్ము చేసుకోండి - మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి'
తొలగింపుపై ఉద్యోగులు ఎక్కువగా మాట్లాడినా గోల చేసినా వేతానాలు రికవరీ సహా కేసులు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని తనంగా వ్యవహరించారని అడ్డగోలుగా ఉద్యోగులను నియమించిన వారికీ లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని హెచ్చరించారు. తక్కువధరకే ఇంటింటికీ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సదుపాయాలు అందించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ఫైబర్ నెట్‌ను వైఎస్సార్సీపీ సర్కారు నిర్వీర్యం చేసేందని అన్నారు.
డబ్బు చెల్లించకుంటే పోలీసులకు ఫిర్యాదు:వ్యూహం సినిమాను ఫైబర్ నెట్లో ప్రసారం చేసినందుకు గానూ గత ప్రభుత్వం రాంగోల్ వర్మకు ఫైబర్ నెట్ నుంచి అక్రమంగా నిధులు చెల్లించారనిని అన్నారు. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారని అన్నారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చామన్న ఆయన గడువులోగా డబ్బు చెల్లించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. న్నారు. మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్ మెంట్లను పరిశీలిస్తున్నామని వారిని మరి కొద్దిరోజుల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి పూర్వవైభవం తెస్తామని ఛైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.
జగన్ అసమర్థత వల్ల రూ.450 కోట్ల అదనపు భారం : పెమ్మసాని చంద్రశేఖర్
పెట్టుబడి పెట్టి మోసపోయారా? - పలు కేసుల్లో నిందితులు మీరే కావొచ్చు! - అసలు విషయం తెలిస్తే షాకే