ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

గుంటూరు గడ్డ టీడీపీ అడ్డా - నేటికీ అడుగుపెట్టని వైఎస్సార్సీపీ - Guntur LOK SABHA ELECTIONS - GUNTUR LOK SABHA ELECTIONS

Guntur Lok Sabha Constituency: ఆంధ్రప్రదేశ్​ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గుంటూరే. గుంటూరు మిర్చి, పొగాకు, పత్తికి ఎంతో పేరుంది. కాగా, చైతన్యవంతమైన ఓటర్లు కలిగిన గుంటూరులో ఇప్పటి వరకు అత్యధికంగా 13సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా 4సార్లు టీడీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ ఎంపీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పారిశ్రామిక వ్యతిరేక విధానాల ఫలితంగా రాజకీయాలకు గుడ్​బై చెప్పారు.

Guntur_Lok_Sabha_Constituency
Guntur_Lok_Sabha_Constituency

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:35 AM IST

Guntur Lok Sabha Constituency:గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. జనరల్‌ కేటగిరీలో ఉంది. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ లోక్​సభ నియోజకవర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి అసెంబ్లీ స్థానాలు ఈ లోక్​సభ నియోజకవర్గంలోకి వచ్చిచేరాయి.

కృష్ణానది ఏర్పర్చిన నల్ల రేగడి నేలలు, ఆహార పంటలకు కేరాఫ్ అడ్రస్​ గుంటూరు జిల్లా. ఆధునిక తెలుగు కవి గుర్రం జాషువా, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు కొండా వెంకటప్పయ్య, ప్రముఖ రచయిత్రి ఓల్గా, నాయని కృష్ణకుమారి గుంటూరు వాసులే. వ్యవసాయ ప్రధానమైన గుంటూరు వాసులు శ్రమజీవులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:

ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్నాయి.

  1. గుంటూరు తూర్పు
  2. గుంటూరు పశ్చిమ
  3. తెనాలి
  4. పొన్నూరు
  5. తాడికొండ(ఎస్సీ)
  6. మంగళగిరి
  7. పత్తిపాడు(ఎస్సీ)

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 17.71 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 8.56 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 9.13 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 191

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 13 సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా 4సార్లు టీడీపీ ఈ లోక్​సభ నియోజకవర్గంలో జెండా ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌పై టీడీపీ అభ్యర్థి గల్లా జయ్‌దేవ్‌ 4వేల 25ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌, వైఎస్సార్సీపీ నుంచి కిలారి వెంకట రోశయ్య బరిలో ఉన్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు:

  • 1952: ఎస్.వి.ఎల్.నరసింహం(స్వతంత్ర)
  • 1957: కె.రఘురామయ్య(కాంగ్రెస్)
  • 1962: కె.రఘురామయ్య(కాంగ్రెస్)
  • 1967: కె.రఘురామయ్య(కాంగ్రెస్)
  • 1971: కె.రఘురామయ్య(కాంగ్రెస్)
  • 1977: కె.రఘురామయ్య(కాంగ్రెస్)
  • 1980: ఎన్.జి.రంగా(కాంగ్రెస్[ఐ])
  • 1984: ఎన్.జి.రంగా(కాంగ్రెస్)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 1989: ఎన్.జి.రంగా(కాంగ్రెస్)- ఎం.ఎస్​.ఎస్​ కోటేశ్వరరావు(టీడీపీ)
  • 1991: ఎస్.ఎం.లాల్‌జాన్‌బాషా(టీడీపీ)- ఎన్​.జి రంగా(కాంగ్రెస్)
  • 1996: రాయపాటి సాంబశిరావు(కాంగ్రెస్)- ఎస్​.ఎం. లాల్​జాన్​బాషా(టీడీపీ)
  • 1998: రాయపాటి సాంబశివరావు(కాంగ్రెస్)- ఎస్​.ఎం. లాల్​జాన్​బాషా(టీడీపీ)
  • 1999: వై.వి.రావు(టీడీపీ)- రాయపాటి సాంబశివరావు(కాంగ్రెస్)
  • 2004 :రాయపాటి సాంబశివరావు(కాంగ్రెస్)- యెంపరాల వెంకటేశ్వరరావు(టీడీపీ)
  • 2009 :రాయపాటి సాంబశివరావు(కాంగ్రెస్)- ఎం. రాజేంద్ర(టీడీపీ)
  • 2014: గల్లా జయ్‌దేవ్‌(టీడీపీ)- వల్లభనేని బాలశౌరి(వైఎస్సార్సీపీ)
  • 2019: గల్లా జయ్‌దేవ్‌(టీడీపీ)- మోదుగుల వేణుగోపాల రెడ్డి(వైఎస్సార్సీపీ)

ABOUT THE AUTHOR

...view details