TDP Super Six Free bus For Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆడపిల్లలు, మహిళల కళ్లలో ఆనందం చూడాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆలోచన చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం హామీకి ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున ఉపయోగించుకుంటున్నారు.
సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా నేడు టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఆర్థికంగా తమకు వెసులుబాటు కలిగిందని మహిళా ప్రయాణికులు తెలిపారు. విద్యార్థినులు తమ రోజూవారీ బస్సు చార్జీలు లేకపోవడం వల్ల తాము ఆ డబ్బులను పుస్తకాలు, నోట్ బుక్స్ కొనుగోలు చేయడానికి, స్టేషనరికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి వినియోగిస్తున్నామని పేర్కొంటున్నారు. బస్సు చార్జీల డబ్బులను రోజువారీ ఇతరత్ర ఖర్చులకు వినియోగించుకుంటున్నామని కొంతమంది విద్యార్థులు తెలిపారు. ఇక గృహిణులు సైతం ఉచిత బస్సు ప్రయాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజూ బస్సు చార్జీలు మిగలడం వల్ల వాటిని నిత్యం వినియోగించే కూరగాయలు, పాలు, పండ్లు, ఉప్పులు, పప్పులు తదితర నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. మొత్తానికి బస్సులు చార్జీల మిగులు తమ కుటుంబానికి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నాలుగు నెలల్లో 40కోట్ల జీరో టికెట్లు జారీచేశారు. ప్రస్తుతం ప్రతినిత్యం 29లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై మహిళల ఆసక్తి
TDP Zone 2 review Meeting: వైసీపీ అరాచక పాలనపై సమరానికి సిద్ధం.. నేడు కాకినాడలో టీడీపీ జోన్-2 సమీక్ష