jagan security petition : జగన్‌కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వ్యక్తిగత భద్రత తగ్గించారని హైకోర్టును జగన్ ఆశ్రయించిన నేపథ్యంలో.. నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామని పోలీసు శాఖ వెల్లడించింది. అయితే, సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని అధికారులు తెలిపారు.
అత్యాధునిక రక్షణ పరికరాలు, నివాసం చుట్టూ 30అడుగుల ఎత్తున ఇనుప గోడకంచె, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు.. మూడు షిఫ్టుల్లో 986 మంది భద్రతా సిబ్బంది.. ఇదంతా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి అనుకుంటే పొరపాటే! మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న భద్రతకు సంబంధించిన లెక్కలివి. ఎన్నికల్లో ఓడిన జగన్ తాజాగా తనకు జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
'పరదాల మాటున తిరిగేవారికి 986 మంది సెక్యూరిటీ అవసరమా? - మనం ప్రజా సేవకులం మాత్రమే' - Jagan Security
సాధారణంగా వీఐపీ భద్రతా సిబ్బంది 100 మందికి మించి ఉండరు. కానీ మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల భద్రత చిన్న గ్రామ జనాభాతో సమానం. దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు. కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఇళ్ల దగ్గర భద్రత కలిపినా అంత మంది ఉండకపోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూడు షిప్టుల్లో 934 మంది ఆయన రక్షణలో నిమగ్నమై ఉంటారు. అంటే ఒక్కో షిఫ్టులో 310 మంది పైమాటే. ఇక ఆయన బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య మూడింతలు మించుతుంది. వారందరికీ ఒక్కొక్కరికి నెలకు సగటున 50వేల లెక్కన ఐదేళ్లలో చెల్లించింది 296 కోట్ల రూపాయల పైమాటే. జగన్ పర్యటనలో పరదాలు కట్టడం, రోడ్ల వెంట చెట్లు కొట్టేయడం చేస్తుంటారు.