Ex Minister Niranjan Reddy Fires on Congress :రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో కమలం పార్టీ నేతలకు నొప్పి వస్తుందన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్(KCR) మీద బురదజల్లిన బీజేపీ, కాంగ్రెస్‌ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీఆర్ఎస్కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలి : కేటీఆర్
ఉచిత బస్సు తప్ప, 72 రోజుల్లో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో(Assembly Meetings) సమస్యలు, హామీలకు పరిష్కారం లేదన్నారు. ప్రత్యామ్నాయం కూడా లేదన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్లో సరిపడా కేటాయింపులు లేవని ఆరోపించారు.
BRS Leader Niranjan Reddy on Congress : 72 రోజుల్లోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తేల్చిచెప్పింది అన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి, గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. హరీశ్‌రావు(Harish Rao) జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా నీటి పారుదల శాఖ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరమన్నారు.
"అసెంబ్లీలో ఒక్క మా హరీశ్‌రావును ఎదుర్కొనేందుకు సీఎం సహా ఆరుగురు మంత్రులు ఏకమై కసరత్తు చేశారు. సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా చర్చల మధ్యలో కలగజేసుకోవటం జరిగింది. వాళ్లు వ్యవహరించిన తీరుపై వారే పునః సమీక్షించుకోవాలి. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ హామీలపై పోరాడే బీజేపీ, తెలంగాణలో ఎందుకు మౌనవ్రతం దాల్చింది. పార్టీ మార్పులు ఏమైనా జరిగాయా?" - నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి