తెలంగాణ

telangana

ETV Bharat / politics

'బీఆర్​ఎస్ హయాంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి' : పొన్నం వ్యాఖ్యలకు హరీశ్​రావు కౌంటర్ - Harish Rao on kaleshwaram project - HARISH RAO ON KALESHWARAM PROJECT

Harish Rao Comments on Congress Govt : బీఆర్​ఎస్​ వచ్చాకనే ఆగిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బీఆర్​ఎస్​ హయాంలోనే బ్యారెజ్​ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చామని తెలిపారు.

BRS Leader Harish Rao Fires on Minister Ponnam
Harish Rao Comments on Congress Govt (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 4:54 PM IST

BRS Leader Harish Rao Fires on Minister Ponnam :కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్​ రావు ఖండించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందనే విషయాన్ని మరిచిపోతున్నారని అన్నారు. ఎఫ్.ఆర్.ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాల తరలింపు జరగలేదన్నారు. దీనిపై ఒక ప్రకటనను హరీశ్​రావు విడుదల చేశారు.

కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించలేదని, 144 మీటర్లకు నీరు చేరితే పాత లో లెవెల్ బ్రిడ్జ్ మునిగిపోయి రాకపోకలు బంద్ అయ్యేవన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి బ్యారేజీ పూర్తి అయినా, పై కారణాల వలన పూర్తి స్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు.

బీఆర్​ఎస్​ వచ్చాకే ఎల్లంపల్లి పనులు జరిగాయి : తెలంగాణ వచ్చాకనే పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేసి, ముంపు బాధితులకు పరిహారం చెల్లించామని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాజీవ్​ రహదారిపై వేగంగా హై లెవెల్​ బ్రిడ్జ్​ నిర్మాణం పూర్తి చేసి ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్​.ఆర్​.ఎల్​ 148 మీటర్ల వరకు 20 టీఎంసీల నీటిని నింపామని వివరించారు. ఇది బీఆర్​ఎస్​ ప్రభుత్వం సాధించిన ఘనత మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్​ఎస్​ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, హైలెవెల్​ బ్రిడ్జి, రహదార్ల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లను వెచ్చించిందని పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ హయాంలోనే బ్యారెజ్​ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చామని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​గా మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభం అయిందని వెల్లడించారు. ఇదంతా జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అన్న వాస్తవాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​ గుర్తించకపోయినా కరీంనగర్​ రైతులకు తెలుసునని హరీశ్​రావు చెప్పారు.

మంత్రి ఉత్తమ్​ చెప్పింది అబద్ధమైతే ప్రివిలేజ్​ మోషన్​ : మొత్తం మీద గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవస్థ ద్వారా సుమారు 20,33,572 ఎకరాలకు సాగునీరు అందిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారన్నారు. ఇది అబద్ధమైతే ఈ అబద్ధాలు చెప్పి శాసన సభ్యులను తప్పుదోవ పట్టించినందుకు ఆయన మీద ప్రివిలేజ్​ మోషన్​ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయం మీద మంత్రి పొన్నం వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details