EC Warning to Minister Konda Surekha comments on KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కొండా సురేఖ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని కొండా సురేఖను హెచ్చరించింది. ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది.
Konda Surekha comments on KTR : ఈనెల 1న వరంగల్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని అందువల్లే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చాడే తప్పా, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్న ఏనాడు బయటకు రాలేదని ఆమె విమర్శించారు. అధికారం లేకనే కేసీఆర్, కేటీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని పేర్కొన్నారు. ఇప్పటికే మీ సోదరి శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారన్న ఆమె వ్యాఖ్యలు చేసింది.