Drone Companies Representatives met with Minister Janardhan Reddy:డ్రోన్ సాంకేతికతను వివిధ శాఖల్లో వినియోగించేందుకు అవకాశాలు ఉన్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం, రహదారులు, భవనాలు, ఇరిగేషన్, అర్బన్ ఏరియా డెవలప్మెంట్, డిఫెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వేలు, మ్యాపింగ్, సీడ్ బాల్స్ ప్లాంటేషన్ లాంటి వివిధ రకాల పనులను సులభతరం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మేరకు మంత్రితో డ్రోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు ఏయే రంగాల్లో తమ టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు సాధించారో మంత్రికి తెలిపారు. రానున్న కాలంలో డ్రోన్ హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న అంశాన్ని మంత్రికి వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.