Help Flood Victims :వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు, చెక్కులు మంత్రి నారా లోకేశ్‌కు అందజేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కళ్లం రాజశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు, కొమ్మారెడ్డి కిరణ్ రూ.10 లక్షలు విరాళం అందించారు. వీరితో పాటు ఏ.వీ రమణారెడ్డి రూ.7 లక్షలు, ఒంగోలుకు చెందిన మేదరమెట్ల సుబ్బయ్య లక్ష రూపాయలు, ఆలూరు కొండలరావ్ రూ.50 వేలు, ఆలూరి ఝాన్సీలక్ష్మి రూ.50 వేల చొప్పున విరాళం అందజేశారు.
వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీ, న్యూ రాజీవ్ నగర్ ప్రాంతాల్లో వరద బాధితుల కోసం ఉదయం నుంచి హెలీకాప్టర్ల ద్వారా 42 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు, పండ్లు జారవిడిచారు. వరద సహాయ చర్యలపై మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్‌లతో లోకేశ్ సమన్వయం చేస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడమే లక్ష్యం- ఆపద సమయంలో కుట్రలా? : చంద్రబాబు - CM review flood relief measures
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందచేసిన తెలుగు సినీ ప్రముఖులకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తోచిన విధంగా చేసే సాయం ప్రజల్ని కాపాడేందుకు ఎంతో ఉపకరిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.