Congress PEC Meeting Tuesday : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు, కళాకారులు కూడా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే, లోక్‌సభ టికెట్ల కోసం అర్జీ చేసుకోగా, మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
Congress Exercise Lok Sabha Candidates :17 నియోజకవర్గాలకు అందిన అర్జీలను (Congress MP Tickets Applications) పరిశీలించినట్లయితే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది ఉన్నారు. అదే విధంగా మహబూబ్‌నగర్‌లో అతి తక్కువ అర్జీలు వచ్చాయి. కేవలం నలుగురు మాత్రమే రేస్‌లో ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా : ప్రధానమైన నాయకుల్లోసికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామిలు పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డిలు టికెట్లు ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్యపవన్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
Congress MP Tickets Applications 2024 : నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి(Mallu Ravi), మందా జగన్నాథం, చారకొండ వెంకటేశ్, సంపత్‌కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, పెరికి శ్యామ్ రేస్‌లో ఉన్నారు. మెదక్ నుంచి ఎం.భవానీ రెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతుండగా, చేవెళ్ల నుంచి భీమ్ భరత్, చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి, కిచ్చనగారి లక్ష్మారెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు