CM Revanth Speech in Rythu Panduga Meeting:మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 70 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటి వరకు రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని సీఎం రేవంత్ అన్నారు.
నవంబరు 29కి ఎంతో ప్రత్యేకత ఉందని సరిగ్గా ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేశారని సీఎం రేవంత్ అన్నారు. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజాప్రభుత్వాన్ని గద్దనెక్కిచ్చారని కొనియాడారు. పాలమూరు జిల్లాలో కృష్ణా నది పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు వలసలు పోతున్నాయని అన్నారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
మూడేళ్లు నిండకుండానే ప్రాజెక్టు కూలింది:గత ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా అని సీఎం ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం అనలేదా అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేస్తే రైతులకు రూ.500 బోనస్ ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టింది కానీ మూడేళ్లు నిండకుండానే ఆ ప్రాజెక్టు కూలిందని ఆరోపించారు. ఈ ఏడాది తెలంగాణలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని వివరించారు. గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని కానీ ప్రజా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 25 లక్షల రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు.
2047 నాటికి రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఎదగాలి - చదువుకున్న యువతే ఆస్తి: చంద్రబాబు