ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైసీపీలో కుప్పకూలిన టాప్​ఆర్డర్​... 'నైట్ ​వాచ్​మెన్'​దే భారం

CM Jagan Changing YSRCP Constituency Incharges: 'నైట్ వాచ్​మెన్​' టెస్ట్ క్రికెట్​లో ఈ పదం వింటుంటాం. లైట్ ఫెయిల్ అయ్యే సమయంలో ఓ కీలక బ్యాట్సమెన్ వికెట్ పడితే, మరో బ్యాట్సమెన్ వికెట్ పడకుండా ఆ రోజు ఆట సమయం గడిచే వరకూ బ్యాటింగ్​కు దిగి టైమ్​పాస్​ చేసే బౌలరే నైట్​ వాచ్​మెన్​. కానీ ఆ నైట్ వాచ్​మెన్​ కూడా పిచ్​ని కాపడలేక ఔట్ అయితే ఆ జట్టు పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీలో అదే పరిస్థితి ఉంది.

CM_Jagan_Changing_YSRCP_Constituency_Incharges
CM_Jagan_Changing_YSRCP_Constituency_Incharges

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 10:05 AM IST

వైఎస్సార్సీపీ నేతలతో జగన్ "ఆడుదాం ఆంధ్రా" - ప్రకటించిన సమన్వయకర్తల్లో మళ్లీ మార్పులు చేర్పులు!

CM Jagan Changing YSRCP Constituency Incharges :సార్వత్రిక ఎన్నికల బరిలో 'ఆడుదాం ఆంధ్ర' అంటూ దిగిన వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్​ తీసుకునే నిర్ణయాలతో పార్టీకి గుడ్​బై చెప్పేస్తున్నారు. క్రికెట్​ భాషలో చెప్పాలంటే టెస్ట్​ మ్యాచుల్లో కీలక బ్యాట్స్​మెన్​ ఔటైతే మరో బ్యాట్స్​మెన్​కు సపోర్టుగా ఓ బౌలర్​ బ్యాటింగ్​కు దిగి ఆ రోజు మ్యాచ్​ సమయం ముగిసే వరకు టైమ్​పాస్​ చేస్తాడు. అతనిని నైట్​ వాచ్​మెన్​ అంటారు. సీఎం జగన్​మోహన్​రెడ్డి కూడా నియోజకవర్గాల్లో కీలక నేతలను పనితీరు బాగోలేదంటూ మార్చేస్తున్నారు. వారి స్థానంలో మరో చోట కీలకమైన నేతలను ఆ స్థానాల్లోకి తీసుకొస్తున్నారు. వారు నెట్​వాచ్​మెన్​ తరహాలో ఏదో ఒక రకంగా నియోజకవర్గంలో నిలబడి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్​ వారినీ మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. అసలే క్షేత్రస్థాయిలో పూర్తి వ్యతిరేకత ఉన్న నేతలు ఏదోలా కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇన్​ఛార్జ్​ల మార్పు అంటూ 4 జాబితాల్లో 50 మందికి పైగా అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. అయిష్టంగానైనా వారు ఆ స్థానాల్లో నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతున్నారు. కానీ మీరంతా తాత్కాలికంగా పిచ్​ని కాపాడే నైట్ వాచ్​మెన్​లు మాత్రమే, ఇక ఔట్ అయిపోడంటూ జట్టు నాయకుడు ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ఆ జట్టు క్లిష్ట పరిస్థితి, జట్టులో ఇతర సభ్యుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే.

CM Jagan Changing YSRCP Constituency Incharges : పాలనలోనే కాదు పార్టీ వ్యవహారాల్లోనూ రివర్స్‌ విధానాన్నే వైఎస్సార్సీపీ కొనసాగిస్తోంది. గత నెల నుంచి మొదలు పెట్టిన నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కసరత్తులో ఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాల్లోని కొందరిని మళ్లీ ఇప్పుడు జగన్ మారుస్తున్నారు.

2024 Elections in AP :మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే ఊదరగొట్టే జగన్‌ ఒక్కసారి కూడా మాట మీద నిలబడింది లేదని ఆ పార్టీ నేతలే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు నియోజకవర్గాల సమన్వయకర్తలను మారుస్తూసొంత పార్టీ నేతలతో ఫుట్‌ బాల్‌ ఆడుకున్న జగన్‌ ఇప్పుడు జాబితాలో ఉన్న వారినీ ఉంచేలా కనిపించడం లేదు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమన్వయకర్తగా మాచాని వెంకటేష్‌ను గతంలో ప్రకటించిన జగన్‌ ఇప్పుడు అక్కడ మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టా రేణుక సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని గురువారం కలిశాక ఈ మార్పును ఖరారు చేశారు. వెంకటేష్‌కు నామినేటెడ్‌ పదవి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

"ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావు, లేదంటే గిద్దలూరుకు వెళ్తావు కదా!" బాలినేని, సీఎంల మధ్య మాటా మంతీ

కర్నూలు లోక్‌సభ స్థానానికి గతంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ప్రకటించారు. ఇప్పుడు కర్నూలు మేయర్‌, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఎంపిక చేశారు. జయరాంకు ఈ మేరకు పార్టీ ముఖ్య నేత ఒకరు శుక్రవారం సమాచారమిచ్చినట్లు సమాచారం. కర్నూలు లోక్‌సభతో పాటు ఆలూరుఅసెంబ్లీ టికెట్‌ కూడా ఇస్తే పోటీచేస్తానని, లోక్‌సభ మాత్రమే అంటే పోటీ చేయలేనని జయరాం తేల్చిచెప్పడంతో ఈ మార్పు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా

నరసరావుపేట లోక్‌సభ ఇన్‌ఛార్జిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను నెల్లూరు నగర సమన్వయకర్తగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎమ్మెల్యేను మార్కాపురానికి, మార్కాపురం ఎమ్మెల్యేను గిద్దలూరుకు మార్చే ప్రతిపాదనను ప్రాథమికంగా ఓకే చేశారని అంటున్నారు. ఐతే స్థానికేతరులను అంగీకరించేది లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. దీంతో పరిస్థితిని సర్దుబాటు చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ అధిష్ఠానం బాధ్యత అప్పగించింది. ఆయనా అంటీముట్టనట్లుగా ఉన్నట్లు తెలిసింది. సోమవారానికి మార్పులన్నీ దాదాపు పూర్తవుతాయని సీఎంఓ వర్గాలు తెలిపాయి.

రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్​ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్​

ABOUT THE AUTHOR

...view details