CM Chandrababu on Swarnandhra-2047 Vision Document:స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు వివిధ వేదికలపై చర్చ జరుపుతూ క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. ప్రతీ నెలా, ప్రతీ క్వార్టర్‌కు లక్ష్యాలు నిర్ణయించుకుని 2047కు ఏం సాధించాలనుకున్నామో అవి చేసుకుంటూ వెళతామని సీఎం వివరించారు. సాధ్యాసాధ్యాలపై నిరంతర పర్యవేక్షణ జరుపుతూ 2047లక్ష్యాలను సాధిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.
విజన్ 2047 లక్ష్యాల సాధనకు అవసరమైన వనరుల సమీకరణల కోసం వినూత్న ఆలోచనలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సెకీ ఒప్పందంలో జగన్‌కు ముడుపులు ముట్టాయని అమెరికా సంస్థలు ఛార్జ్ షీట్లు దాఖలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపదుతుందా అనే ప్రశ్నకు స్పందించిన సీఎం దీనిపై అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. న్యాయనిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తుందని తెలిపారు.