CM Chandrababu on Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఐదారు గంటలుగా సచివాలయంలో పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు చర్చించారు. వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పదవుల ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి లిస్టులో ఇచ్చిన దాని కంటే రెండు మూడు రెట్లు అధికంగా రెండో జాబితా ఉంటుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు లోతుగా కసరత్తు చేస్తున్నారు.
కూటమి నేతలకు మళ్లీ పండగ - రెండో విడత నామినేటెడ్ పదవులపై కసరత్తు - CM CHANDRABABU ON NOMINATED POSTS
వారంలో పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం - పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన పదవులు ఇచ్చేందుకు కసరత్తు
CM Chandrababu (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2024, 10:19 PM IST